ఏఐ సాంకేతికత దుర్వినియోగమైతే వంద కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. ఏఐ స్వయంగా మానవాళిని అంతం చేస్తుందని తాను నమ్మనని, కానీ చెడు ఉద్దేశాలు కలిగిన వ్యక్తులు సైబర్ దాడులు, జీవాయుధ తయారీకి ఏఐని వాడే ముప్పు పొంచి ఉందని ఆయన వివరించారు. పరిశ్రమ స్వీయ నియంత్రణ సరిపోదని, ప్రభుత్వాలు కఠిన చట్టాలు తేవాలని ఆయన కోరారు.
బిల్ గేట్స్ హెచ్చరిక: ఏఐ దుర్వినియోగంతో వంద కోట్ల ప్రాణాలకు ముప్పు
Source: Webdunia Telugu