మహేశ్‌బాబు హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా 60–65 వేల స్క్రీన్లలో విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఉత్తర అమెరికా, చైనా మార్కెట్లలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు రాజమౌళి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఉత్తర అమెరికాలో కనీసం 50 మిలియన్ డాలర్ల వసూళ్లు లక్ష్యమని సమాచారం.
వారణాసి: ప్రపంచవ్యాప్తంగా 60–65 వేల స్క్రీన్ల లక్ష్యం
Source: Chitrajyothy