తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, క్రమశిక్షణా రాహిత్యం తీవ్రమవుతున్నా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సరైన చర్యలు తీసుకోవడం లేదని గాంధీ భవన్ వర్గాలు విమర్శిస్తున్నాయి. సీనియర్ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా నోటీసులతో సరిపెట్టడం, డిసిసి అధ్యక్షుల ఎంపికలో దిగువ స్థాయి ఒత్తిళులకు లొంగడం ఆయన బలహీనతగా పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ నిర్వహణపై పార్టీలో తీవ్ర అసంతృప్తి
Source: Telugu360