అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఒక్కరోజే భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,160 పెరగగా, కిలో వెండి ధర రూ.10 వేల మేర పెరిగింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యంతో డాలర్ విలువ పడిపోవడం ఇందుకు కారణమని ఆగ్మాంట్ నివేదిక తెలిపింది. దీపావళి సీజన్లో ఈ పెరుగుదల కొనుగోలుదారులపై భారం మోపుతోంది.
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల
Source: Vaartha