తెలంగాణలో ధరణి పోర్టల్ అక్రమాలపై సీఐడీ రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రత్యేక బృందాలతో మెరుపు దాడులు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఆపరేటర్లు, ప్రైవేటు వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలపై సోదాలు జరిపి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వులను దుర్వినియోగం చేసి భూ హక్కుల మార్పిడి, భూదాన్ భూముల బైనంబర్ల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ధరణి అక్రమాలపై సీఐడీ 15 బృందాల మెరుపు దాడులు
Source: telugutimes.net