తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

ఐఎండీ విడుదల చేసిన తాజా అప్డేట్ ప్రకారం తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర మరియు తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు ఈ వర్షాలు ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies