పాక్ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన ఢిల్లీ పోలీసులు

పాక్ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన ఢిల్లీ పోలీసులు

ప్రస్తుత సీజేపీ ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన 480కి పైగా సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వీటి ద్వారా వదంతులు, నకిలీ పోస్టులు, ఎడిట్ చేసిన వీడియోలను వ్యాప్తి చేసి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఈ ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గుర్తించిన హ్యాండిల్స్‌లో చాలా వరకు 'ఆపరేషన్ సింధూర్' సమయంలో కూడా చురుకుగా ఉన్నాయని ఆరోపించారు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies