పాలమూరు విశ్వవిద్యాలయం ఆగస్టు 7, 8 తేదీల్లో కణ్హా శాంతివనంలో ‘మిషన్ ఇండియా @2047’ జాతీయ సదస్సును నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు ఈ అవకాశం కోసం పోటీ పడగా, పాలమూరు వర్సిటీ దీన్ని దక్కించుకుంది. ఉన్నత విద్య, పరిశోధన, కృత్రిమ మేధస్సు, స్టార్టప్‌లు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ సదస్సు భారతదేశాన్ని వికసిత్ భారత్–2047 లక్ష్యాల వైపు నడిపించే వేదికగా నిలుస్తుందని తెలిపారు.
పాలమూరు వర్సిటీలో ‘మిషన్ ఇండియా @2047’ జాతీయ సదస్సు
Source: Vaartha
Read the live feed on ZapIndies