ఆగస్టు నుంచి ఏపీలో సంజీవని ఆరోగ్య పథకం అమలు

ఆగస్టు నుంచి ఏపీలో సంజీవని ఆరోగ్య పథకం అమలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక ‘సంజీవని’ ఆరోగ్య పథకం ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని ప్రకటించారు. ఈ పథకంలో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, హెల్త్ ఐడీ జారీ చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు అన్ని ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో వ్యాధులు రాకముందే నివారించే త్రిముఖ వ్యూహంతో ఈ పథకం రూపొందించినట్లు సీఎం తెలిపారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies