అరుణాచలంలో మోక్ష ద్వారంలో చిక్కుకుని భక్తుడి మృతి

అరుణాచలంలో మోక్ష ద్వారంలో చిక్కుకుని భక్తుడి మృతి

తమిళనాడులోని తిరువణ్ణామలైలోని ఇడుక్కు పిళ్ళైయార్ ఆలయంలో మోక్ష ద్వారం అనే ఇరుకైన గుహలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 36 ఏళ్ల మణికుమార్ అనే భక్తుడు మృతి చెందాడు. ఈ సంఘటన జూలై 24న జరిగింది. అరుణాచలం దర్శనం అనంతరం గిరివలం చేస్తూ ఆలయానికి వచ్చిన ఆయన సంప్రదాయం ప్రకారం ఇరుకైన మార్గంలో ప్రవేశించి చిక్కుకున్నాడు. తర్వాత బయటకు తీసినా శ్వాస తీసుకోలేక కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Source: Gulte Telugu

Read the live feed on ZapIndies