చెరువుగట్టులో 17 దుకాణాలు దగ్ధం

చెరువుగట్టులో 17 దుకాణాలు దగ్ధం

నల్గొండ జిల్లా నర్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు పూర్తిగా కాలిపోయాయి. రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి కూడా మంటలు వ్యాపించాయి. సుమారు రూ. 2.5 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రాణనష్టం లేదు. మూడు అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies