ఇస్నాపూర్‌లో అదృశ్యమైన నలుగురు విద్యార్థినులు సురక్షితంగా గుర్తింపు

ఇస్నాపూర్‌లో అదృశ్యమైన నలుగురు విద్యార్థినులు సురక్షితంగా గుర్తింపు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు జూలై 23న అదృశ్యమైన ఘటనలో పోలీసులు వారిని సురక్షితంగా కనుగొన్నారు. 16 ఏళ్ల కుష్బూ కుమారి, 12 ఏళ్ల మహిమా కుమారి, రోజా కుమారి, ప్రియా కుమారి పాఠశాలకు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేసి బాలికలను కనుగొన్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies