పొగాకు రైతులకు ధర లోటు భర్తీ పథకం ప్రకటన

పొగాకు రైతులకు ధర లోటు భర్తీ పథకం ప్రకటన

మార్కెట్‌లో సరైన మద్దతు ధరలు లభించక నష్టాల పాలవుతున్న పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ‘ధర లోటు భర్తీ’ కింద కిలోకు రూ.20 అదనంగా చెల్లిస్తామని ప్రకటించారు. దీనికి ప్రభుత్వంపై రూ.188 కోట్ల అదనపు భారం పడనుంది. పొగాకు బోర్డు మొత్తం 9.4 కోట్ల కిలోల పొగాకును కొనుగోలు చేయనుంది. బ్రైట్ రకానికి కిలో రూ.240, మీడియంకు రూ.190, లోగ్రేడ్కు రూ.110 కంటే తగ్గకుండా ధరలు నిర్ణయించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies