నెల్లూరు జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో 85.28% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. మొత్తం 19,74,240 మంది ఓటర్లలో 16,83,557 మంది నుండి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించారు. మ్యాపింగ్ పూర్తయిన వారిలో 83.5% మందిని 2002 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేశారు. ఈ నెల 31న ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని, ఆ తర్వాత 30 రోజుల పాటు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
నెల్లూరులో ఓటర్ల మ్యాపింగ్ 85.28% పూర్తి
Source: Vaartha
Read the live feed on ZapIndies