తాలిపేరు ప్రాజెక్టుకు వరద: 22 గేట్లు ఎత్తివేత

తాలిపేరు ప్రాజెక్టుకు వరద: 22 గేట్లు ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. బుధవారం నీటి మట్టం 73.39 మీటర్లకు చేరడంతో, 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 30,024 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాలైన చర్ల, భద్రాచలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies