టాటా పవర్ ప్రాజెక్ట్ ఏపీ నుంచి ఒడిశాకు మార్పు

టాటా పవర్ ప్రాజెక్ట్ ఏపీ నుంచి ఒడిశాకు మార్పు

టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ తన రూ.6,675 కోట్ల పునరుత్పాదక ఇంధన తయారీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిశాకు తరలించింది. నెల్లూరు జిల్లాలో 10 గిగావాట్ల ఇంగాట్లు, వేఫర్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం రూ.2,225 కోట్ల పెట్టుబడి సబ్సిడీతో సహా భారీ ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. అయినా, ఒడిశా ప్రభుత్వం మరింత ఆకర్షణీయమైన ప్యాకేజీ ఇవ్వడంతో టాటా పవర్ అక్కడే ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పరిణామం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.

Source: Great Andhra

Read the live feed on ZapIndies