బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో కోస్తా, రాయలసీమలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies