తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట వరకు క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 74,471 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.68 కోట్లు వచ్చింది. త్వరలో సిఫార్సు లేఖల స్వీకరణతో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
Source: Telugu Post
Read the live feed on ZapIndies