రేవంత్ 'క్రిమినల్ వేస్ట్' వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

రేవంత్ 'క్రిమినల్ వేస్ట్' వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్'గా వ్యాఖ్యానించడం దుమారం రేపింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు డిమాండ్ చేస్తున్న విద్యార్థులపై కక్షతో సీఎం ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల హక్కుల పోరాటాలను అణచివేసే ప్రయత్నంగా అభివర్ణించారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన ఇంజనీరింగ్ విద్యార్థులను నేరస్థులతో పోల్చడం సిగ్గుచేటని, విద్యా సంస్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies