భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. భద్రాచలం వద్ద నీటి మట్టం 49.8 అడుగులకు చేరుకోగా, శుక్రవారం రాత్రి మొదటి, శనివారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాలను అప్రమత్తం చేశారు. NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
గోదావరి వరద: రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవకాశం
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies