గుప్తనిధుల పేరుతో స్నేహితుడికి బంగారు పూత రాళ్లతో మోసం

గుప్తనిధుల పేరుతో స్నేహితుడికి బంగారు పూత రాళ్లతో మోసం

నిజామాబాద్ జిల్లాలో గుప్తనిధుల నాటకంతో స్నేహితుడిని మోసం చేసిన ఘటన కలకలం రేపింది. హమాల్వాడీకి చెందిన శ్రీనివాస్ ప్రాణస్నేహితుడైన రమేష్ వద్ద రూ.1.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకునేందుకు గుప్తనిధులు దొరికాయని, ఆ బంగారమే ఇదని చెప్పి బంగారు పూత పూసిన రాళ్లను అందించాడు. వాటిని నిపుణులతో పరీక్షించిన రమేష్కు మోసం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies