ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విశాఖపట్నంలో రూ.460 కోట్లతో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టు, కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్-1, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ప్రారంభించారు. NH67 తాడిపత్రి వద్ద 4 లేన్ల బైపాస్, NH365BG రహదారులను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాన్ని సాంకేతిక, హరిత ఇంధన కేంద్రంగా మార్చనున్నాయి.
ఏపీలో అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
Source: Vaartha
Read the live feed on ZapIndies