అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో ఐఐటీ గౌహతి రెండవ సంవత్సరం బీటెక్ విద్యార్థిని చేతన (20) మృతి చెందింది. కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ కె. సైనాథ్ రెడ్డి కుమార్తె అయిన ఆమె సహచర విద్యార్థితో కలిసి నదీ తీరానికి వెళ్లగా ప్రమాదవశాత్తు జారి ప్రవాహంలో కొట్టుకుపోయింది. సహచరుడిని పది నిమిషాల్లో రక్షించగా, బలమైన ప్రవాహం కారణంగా చేతన కనిపించకుండా పోయింది. మూడు గంటల శోధన తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ సభ్యులు అసోంకు బయలుదేరారు.
బ్రహ్మపుత్రలో ఐఐటీ విద్యార్థిని మృతి
Source: Gulte Telugu
Read the live feed on ZapIndies