తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. గోదావరి వరద ప్రభావంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 56 అడుగులకు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Source: Asianet Telugu
Read the live feed on ZapIndies