ఆయిల్పామ్ గెలల ధర స్వల్పంగా తగ్గింది

ఆయిల్పామ్ గెలల ధర స్వల్పంగా తగ్గింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఆయిల్ పామ్ రైతులకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ (TS Oilfed) జూలై నెలకు గెలల ధరను టన్నుకు రూ. 23,488గా నిర్ణయించింది. జూన్‌లో రూ. 23,783 ఉండగా రూ. 295 తగ్గింది. అంతర్జాతీయ పామాయిల్ ధరల ఆధారంగా రేట్లు ఖరారవుతుంటాయి. పెరుగుతున్న పెట్టుబడి వ్యయంతో ధర తగ్గడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దిగుబడి మెరుగ్గా ఉంటే నష్టాన్ని భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies