పాకిస్థాన్లో శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి: 7 మృతి

పాకిస్థాన్లో శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి: 7 మృతి

పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ స్వాత్ జిల్లాలో ఉగ్రవాదులు శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు. స్థానికంగా పెరుగుతున్న హింసను నిరసిస్తూ ప్రశాంత వాతావరణం కోరుతూ నిర్వహించిన ర్యాలీని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. భద్రతా బలగాలు ప్రాంతాన్ని కట్టుదిట్టం చేశాయి.

Source: Vaartha

Read the live feed on ZapIndies