ఇరాన్పై మళ్లీ దాడులకు అమెరికా సిద్ధం

ఇరాన్పై మళ్లీ దాడులకు అమెరికా సిద్ధం

ఇరాన్పై మరోసారి సైనిక దాడులు చేపట్టే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు వైట్‌హౌస్ సంకేతాలు ఇచ్చింది. గత నెల ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఒత్తిడి పెంచుతోంది. హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు ఇరాన్ విప్లవ గార్డు ప్రకటించగా, కువైట్ తమ గగనతలంలోకి వచ్చిన డ్రోన్లను కూల్చివేసింది. మరోవైపు గాజా యుద్ధ విరమణ కోసం హమాస్ నిరాయుధీకరణకు అంగీకరించింది.

Source: Telugu Post

Read the live feed on ZapIndies