షమీ ఎంపికపై అజిత్ అగార్కర్ క్లారిటీ: ఫిట్‌నెస్ లేకపోవడమే కారణం

షమీ ఎంపికపై అజిత్ అగార్కర్ క్లారిటీ: ఫిట్‌నెస్ లేకపోవడమే కారణం

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఇంగ్లాండ్ పర్యటనకు దూరం కావడానికి పూర్తి ఫిట్‌నెస్ లేకపోవడమే కారణమని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. వన్డే ప్రపంచకప్ అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్న షమీ బెంగళూరు ఎన్‌సీఏలో రీహాబిలిటేషన్ కొనసాగిస్తున్నారు. తొందరపడి రిస్క్ తీసుకోవద్దని, దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్ ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాతే తిరిగి జట్టులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు.

Source: Namasthe Telangana

Read the live feed on ZapIndies