E20 వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్

E20 వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్

పంజాబ్ శాసనసభ కేంద్ర ప్రభుత్వ E20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించింది. ఇథనాల్ 20 శాతం కలిసిన ఈ ఇంధనం వల్ల పాత ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, మైలేజీ తగ్గుతోందని ఆరోపిస్తూ, నిర్బంధ సరఫరా నిలిపివేయాలని కోరింది. ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా తీర్మానం ప్రవేశపెట్టగా, సీఎం భగవంత్ మాన్ సమర్థించారు. వినియోగదారులకు ఛాయిస్ ఇవ్వాలని, ధర తగ్గించాలని, నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies