భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ఇండెల్ మనీ లిమిటెడ్‌కు చెందిన విదేశీ మారక విభాగం ‘ఇండెల్ రెమిట్’కు వాణిజ్య చెల్లింపుల సేవలను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఇప్పటికే అధీకృత డీలర్ కేటగిరీ-II లైసెన్స్ కలిగి ఉంది. కొత్త అనుమతితో వ్యాపార చెల్లింపులు, వాణిజ్యేతర కరెంట్ ఖాతా లావాదేవీలు ఒక్కో దానికి గరిష్టంగా రూ.25 లక్షల వరకు నిర్వహించవచ్చు. దీనివల్ల భారతీయ వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సురక్షితంగా, వేగంగా అంతర్జాతీయ లావాదేవీలు చేసుకునే వీలుంది.
ఆర్‌బిఐ ఆమోదంతో ఇండెల్ రెమిట్ వాణిజ్య చెల్లింపుల సేవలు
Source: Vaartha
Read the live feed on ZapIndies