జనన, మరణ నమోదు సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

జనన, మరణ నమోదు సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

రాజ్యసభ మంగళవారం జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు-2026కు ఆమోదం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం 21 రోజుల్లోపు నమోదు చేస్తే ఫీజు ఉండదు. ఒక సంవత్సరం లోపు నమోదుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు నమోదుకు జిల్లా మేజిస్ట్రేట్ లేదా ఎస్డీఎం అనుమతి అవసరం. రెండేళ్లకు పైగా ఆలస్యమైతే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో మాత్రమే నమోదు చేయాలి. నకిలీ ధ్రువపత్రాలను అరికట్టడం, సకాలంలో నమోదును ప్రోత్సహించడం ఈ సవరణల లక్ష్యం.

Source: Asianet Telugu

Read the live feed on ZapIndies