హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం, హెచ్ఎంఆర్ఎల్ సంస్థ నెలవారీ, క్వార్టర్లీ పాస్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ పాస్ విధానాన్ని మెట్రోలో అమలు చేసే అంశంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. నిత్యం 4.70 నుంచి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు ఈ పాస్లు లాభదాయకంగా ఉంటాయని, మెట్రో వినియోగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
మెట్రోలో త్వరలో నెలవారీ, క్వార్టర్లీ పాస్లు: ప్రయాణికులకు శుభవార్త
Source: Vaartha
Read the live feed on ZapIndies