తల్లిపాలు ఇచ్చే సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. పప్పులు, గుడ్లు, చేపలు, పాలు, పెరుగు వంటి ప్రోటీన్ ఆహారాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు డైట్లో చేర్చుకోవాలి. కేకులు, చిప్స్, ఫాస్ట్ ఫుడ్, కెఫీన్ ఉన్న పానీయాలను పరిమితం చేయాలి. అతిగా తినకుండా, రోజుకు మూడు పూటల సమతుల్య భోజనం, ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలి. బిడ్డకు అలర్జీ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
తల్లిపాల కాలంలో డైట్: తినాల్సినవి, మానేయాల్సినవి
Source: ABP Desam
Read the live feed on ZapIndies