కావడి యాత్ర వైభవంగా సాగుతోంది

కావడి యాత్ర వైభవంగా సాగుతోంది

ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ కావడి యాత్ర వైభవంగా సాగుతోంది. శివ భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి, పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, సుల్తాన్‌గంజ్ వంటి పుణ్యక్షేత్రాలకు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. హరిద్వార్ గంగా తీరంలో యాత్రికులపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. పురాణాల ప్రకారం, క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు స్వీకరించగా, దాని తీవ్రత తగ్గించేందుకు గంగాజలంతో అభిషేకం చేశారు. ఆ జ్ఞాపకార్థమే ఈ యాత్ర చేస్తారని ప్రొఫెసర్ దేవీప్రసాద్ దూబే తెలిపారు.

Source: telugutimes.net

Read the live feed on ZapIndies