బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,31,990 రూపాయలు, 24 క్యారెట్ల ధర 1,43,990 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,34,900 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. పశ్చిమాసియా యుద్ధం, హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మెరుగుపడటంతో క్రూడాయిల్ ధరలు తగ్గుతుండటం, ఆషాఢ మాసం కావడంతో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ధరలు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Source: Telugu Post

Read the live feed on ZapIndies