చందానగర్లో లిఫ్ట్ ప్రమాదం: మహిళ మృతి

చందానగర్లో లిఫ్ట్ ప్రమాదం: మహిళ మృతి

హైదరాబాద్ చందానగర్లోని చాట్వాజ్ మెన్షన్ అపార్ట్మెంట్లో మంగళవారం లిఫ్ట్ ప్రమాదం సంభవించింది. నల్లగండ్లకు చెందిన అనసూయ (43) లిఫ్ట్ ఎక్కుతుండగా అది అకస్మాత్తుగా పైకి కదలడంతో కేబిన్ మరియు ప్రవేశ ద్వారం మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies