ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను కలిసి పాలమూరు-రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మ సాగర్, డిండి ప్రాజెక్టులకు సత్వర పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయి వ్యయం పెరుగుతోందని ఆయన వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై రూ.42,809 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు.
పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Source: telugutimes.net
Read the live feed on ZapIndies