GLP-1 మందుల ప్రచారంపై కేంద్రం కఠిన చర్యలు

GLP-1 మందుల ప్రచారంపై కేంద్రం కఠిన చర్యలు

బరువు తగ్గించే GLP-1 మందుల సోషల్ మీడియా ప్రమోషన్లు, తప్పుడు ప్రచారాలపై కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. టైప్-2 మధుమేహం చికిత్స, నిర్దిష్ట వైద్య ప్రమాణాలున్న రోగుల్లో బరువు నియంత్రణకు మాత్రమే ఈ మందులు ఆమోదించినట్లు స్పష్టం చేసింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడితే తీవ్ర దుష్ప్రభావాలున్నాయని హెచ్చరించింది. ఇప్పటికే 49 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేసింది.

Source: Vaartha

Read the live feed on ZapIndies