దేశంలో గృహావసరాలకు ఉపయోగించే ఎల్పీజీ (LPG) మరియు పారిశ్రామిక అవసరాలకు వాడే ఎల్‌ఎన్‌జీ (LNG) సిలిండర్లపై అదనపు ఫీజులు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముడి చమురు తరహాలో అత్యవసర ఇంధన నిల్వలను ఏర్పాటు చేసే భారీ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదన ప్రకారం ఎల్పీజీపై కిలోకు రూ. 1.29, ఎల్‌ఎన్‌జీపై క్యూబిక్ మీటర్‌కు రూ. 1.43 సెస్ వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 18 వరకు పెరగవచ్చని అంచనా. రాబోయే 10 ఏళ్లలో ఈ నిల్వల కోసం కేంద్రం 42 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది.
LPG, LNG సిలిండర్లపై అదనపు సెస్ ఆలోచనలో కేంద్రం
Source: Vaartha
Read the live feed on ZapIndies