పెట్రోల్, డీజిల్ వాహనాలను ఆటో ఎల్పీజీకి మార్చేందుకు జాతీయ రీట్రోఫిట్ విధానం తీసుకురావాలని ఇండియన్ ఆటో ఎల్పీజీ కోలిషన్ (ఐఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో ఏటా దాదాపు 60 లక్షల పాత వాహనాల విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ మార్కెట్ ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని సంస్థ పేర్కొంది. ఢిల్లీ-ఎన్సీఆర్ సహా కాలుష్య ప్రమాణాలు అందుకోలేని నగరాల్లో ఈ విధానం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.
పెట్రోల్, డీజిల్ కార్లకు గుడ్బై? ఆటో ఎల్పీజీ రీట్రోఫిట్ పాలసీ కోరిక
Source: HMTV
Read the live feed on ZapIndies