ఆయుష్మాన్ భారత్‌ కింద 12.69 కోట్ల చికిత్సలు

ఆయుష్మాన్ భారత్‌ కింద 12.69 కోట్ల చికిత్సలు

ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 12.69 కోట్ల నగదురహిత ఆస్పత్రి చికిత్సలకు అనుమతి లభించిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ చికిత్సల విలువ రూ.1.92 లక్షల కోట్లు. జూన్ 30 నాటికి 37,413 ఆస్పత్రుల నెట్‌వర్క్ ద్వారా సేవలు అందాయి. ఈ పథకంతో ప్రజల స్వయం భరించే వైద్య ఖర్చు 2014–15లో 62.6 శాతం నుంచి 2022–23 నాటికి 43.4 శాతానికి తగ్గిందని మంత్రి ప్రతాప్‌రావు జాధవ్ రాజ్యసభలో తెలిపారు.

Source: HMTV

Read the live feed on ZapIndies