ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేఖ రాసి, గతంలో ఇచ్చిన హామీలను నిలుపుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి నెలా రూ.170 కోట్ల నిధులు విడుదల చేస్తామన్న హామీ మేరకు చెల్లింపులు జరగడం లేదని, వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించింది. తక్షణమే రూ.600 కోట్ల బకాయిలు చెల్లించాలని, నెలవారీ చెల్లింపులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేసింది. బకాయిలు చెల్లించే వరకు ఫ్రీ ఆథరైజేషన్ ప్రక్రియను నిలిపివేస్తామని హెచ్చరించింది.
ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల నుంచి కూటమి ప్రభుత్వానికి షాక్
Source: Vaartha
Read the live feed on ZapIndies