పీవోకే ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ ఆధిక్యం

పీవోకే ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ ఆధిక్యం

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ అధికార పీఎంఎల్-ఎన్ పార్టీ తొలి రెండు విడతల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుని దశాబ్దం తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. శరణార్థుల నిమిత్తం కేటాయించిన 12 స్థానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చినా ప్రజలు తిరస్కరించారు. ముజఫరాబాద్‌తో సహా 50 శాతానికి పైగా ఓటర్లు ఓటు వేశారు. మూడో విడత పోలింగ్ ఆగస్టు 10న జరగనుంది.

Source: Vaartha

Read the live feed on ZapIndies