అతీక్ అహ్మద్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి

అతీక్ అహ్మద్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి

దివంగత గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ (21) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రయాగ్‌రాజ్ నుంచి ఝాన్సీకి వెళ్తున్న హ్యుందాయ్ క్రెటా కారు అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అబాన్‌తో పాటు సోను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైవేపై జంతువు అడ్డురావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Source: Vaartha

Read the live feed on ZapIndies