లేపాక్షి క్యూఆర్ కోడ్ విధానం ప్రారంభం

లేపాక్షి క్యూఆర్ కోడ్ విధానం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో 'లేపాక్షి' క్యూఆర్ కోడ్ విధానం ప్రారంభించారు. స్కాన్ ద్వారా కళాఖండాల వివరాలు, హస్తకళాకారుల పేర్లు, చరిత్ర, GI ట్యాగ్, ODOP గుర్తింపు తెలుసుకోవచ్చు. తొలి దశలో బొబ్బిలి వీణ, కలంకారీ పెయింటింగ్స్, సవర ఆదివాసి పెయింటింగ్స్ వంటి 8 ఐకానిక్ ఉత్పత్తులకు వర్తింపజేస్తున్నారు. నకిలీ ఉత్పత్తులను అరికట్టడం, హస్తకళాకారులకు సరైన ధర లభించడం లక్ష్యం.

Source: Vaartha

Read the live feed on ZapIndies