గోబర్ధన్ పథకానికి కేంద్రం ఆమోదం

గోబర్ధన్ పథకానికి కేంద్రం ఆమోదం

వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో రైతులకు అదనపు ఆదాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.23,731 కోట్లతో గోబర్ధన్ పథకానికి ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2035-36 వరకు పదేళ్లపాటు అమలు చేసే ఈ పథకం ద్వారా దేశీయంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ఉత్పత్తిని పది రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల రైతులకు మంచి గిరాకీ, గ్రామీణ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

Source: Vaartha

Read the live feed on ZapIndies