కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ కలపాలనే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు అవాస్తవమని ఖండించారు. సాధారణ ఇథనాల్‌కు, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (SAF)కు మధ్య తేడా ఉందని, భద్రతా ప్రమాణాలకు విఘాతం కలిగించే నిర్ణయాలు తీసుకోబోమని తెలిపారు.
ATFలో ఇథనాల్ కలపడంపై రామ్మోహన్ నాయుడు స్పష్టత
Source: Vaartha
Read the live feed on ZapIndies