హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తంగళ్ళపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను పరిశీలించి, వచ్చే విద్యా సంవత్సరంలోపు పూర్తి చేసి హాస్టల్ సహా తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గౌరవెల్లి కాలువల భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల
Source: HMTV
Read the live feed on ZapIndies