థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పిడుగుపడి 24 ఏళ్ల సోఫ్వాన్ అవే అనే ఆటగాడు మృతి చెందాడు. గోలోక్ ఎఫ్ఏ కప్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో వర్షం కురుస్తున్నా ఆటను కొనసాగించారు. పిడుగుపాటుకు అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానిక పోలీసులు, థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సంతాపం తెలిపాయి. ఈ ఘటనపై నెటిజన్లు ప్రతికూల వాతావరణంలో మ్యాచ్‌లు నిలిపివేసేలా కఠిన నిబంధనలు డిమాండ్ చేస్తున్నారు.
థాయ్‌లాండ్‌లో పిడుగుపాటుకు ఫుట్‌బాల్ ఆటగాడు మృతి
Source: Vaartha
Read the live feed on ZapIndies