రుణ వసూళ్లపై ఆర్బీఐ కీలక ఆదేశాలు

రుణ వసూళ్లపై ఆర్బీఐ కీలక ఆదేశాలు

రుణ వసూళ్ల పేరుతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అవలంబిస్తున్న వివాదాస్పద పద్ధతులకు అడ్డుకట్ట వేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిఫాల్ట్ కస్టమర్ల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను రిమోట్‌గా బ్లాక్ చేయడం లేదా డిసేబుల్ చేయడం చేయకూడదని స్పష్టం చేసింది. అయితే, బ్యాంక్ అందించిన రుణంతో కొనుగోలు చేసిన పరికరాలను మాత్రమే చివరి అస్త్రంగా డిసేబుల్ చేయవచ్చని నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Source: Vaartha

Read the live feed on ZapIndies